
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: పాతబస్తీలోని హస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ స్థల విషయమై సాదేశ్, షేక్ ఉమర్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. మాటామాటా పెరిగి ఇద్దరూ ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇందులో సాదేఖ్ అనే వ్యక్తి తన వద్ద నున్న పిస్టల్‌తో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సాదేఖ్‌ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నున్న పాయింట్ 32 పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.