టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం | Fire in the Tire industry | Sakshi
Sakshi News home page

టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం

Feb 4 2018 6:45 PM | Updated on Sep 5 2018 9:47 PM

Fire in the Tire industry - Sakshi

ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా : ఖాజీపేట మండలం ఐడీబీఎల్‌లోని జై చిరంజీవ టైర్ల పరిశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ డోర్ బ్లాస్టవ్వడంతో  ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హన్మకొండ లోని మాక్స్ కేర్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన వారే. వీరిలో పప్పు రాజ్ బార్ అనే ఆపరేటర్ ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఖాజీపేట ఏసీపీ సత్యనారాయణ, సీఐ ధర్మసాగర్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement