ఘోర అగ్నిప్రమాదం..13 మంది మృతి | Fire at condominium in southern Vietnam kills at least 13 | Sakshi
Sakshi News home page

ఘోర అగ్నిప్రమాదం..13 మంది మృతి

Mar 23 2018 9:04 AM | Updated on Sep 5 2018 9:47 PM

Fire at condominium in southern Vietnam kills at least 13  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హానోయ్‌ : వియత్నాంలోని హో చి మిన్‌ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నివాస సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు 13 మంది మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన మూడు బిల్డింగ్‌లలో సుమారు 700 ల అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది మంటల్లో చిక్కుకున్నదనే విషయం, ప్రమాదానికి గల కారణాలు అధికారులు తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు.

చాలా మంది ప్రజలు గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు చెబుతున్నారు.  అగ్ని ప్రమాదం కింద ఫ్లోర్‌లో చోటుచేసుకోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదస్థలంలో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది ప్రజలు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement