బ్యాంకులో అగ్ని ప్రమాదం | Fire Accident in Bank Hyderabad | Sakshi
Sakshi News home page

బ్యాంకులో అగ్ని ప్రమాదం

Apr 1 2019 7:19 AM | Updated on Apr 1 2019 7:19 AM

Fire Accident in Bank Hyderabad - Sakshi

కాలి బూడిదైన సామగ్రి

మేడ్చల్‌: మేడ్చల్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకులో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలను ఆర్పివేయించారు.

మంటల్లో బ్యాంకులో ఉన్న అన్ని కంప్యూటర్లు, కౌంటింగ్‌ మిషన్లు, రూటర్లు, కేబుళ్లు, పాస్‌బుక్‌ ప్రింటర్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. షార్ట్‌ సర్క్యుట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. అగ్ని ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement