ఓలా మాజీ డ్రైవర్‌ అరెస్ట్‌ | Ex-Ola driver held after robbing and raping woman, say police | Sakshi
Sakshi News home page

ఓలా మాజీ డ్రైవర్‌ అరెస్ట్‌

Dec 24 2017 9:29 AM | Updated on Sep 29 2018 5:26 PM

Ex-Ola driver held after robbing and raping woman, say police - Sakshi

సాక్షి, ముంబయి: థానే జిల్లాలో 32 ఏళ్ల యువతిపై దోపిడీ, అత్యాచారానికి పాల్పడిన క్యాబ్‌ డ్రైవర్‌, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధిత మహిళ కషిమిరా నుంచి థానేకు ప్రయాణిస్తుండగా వీరు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.నిందితులిద్దరినీ పాండురంగ్‌ గొసావి, ఉమేష్‌ జస్వంత్‌లుగా గుర్తించారు. వీరిలో గొసావి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గొసావి గత వారం నుంచి డ్యూటీకి దూరంగా ఉన్నప్పటికీ కారుపై ఇప్పటికీ ఓలా స్టిక్కర్‌ ఉందని పోలీసులు తెలిపారు.

కషిమిరా ప్రాంతం నుంచి థానే వెళ్లేందుకు ఈనెల 19 సాయంత్రం బాధితురాలు గొసావి క్యాబ్‌లో ఎక్కారు. క్యాబ్‌ను వజ్రేశ్వరి ప్రాంతానికి మళ్లించిన గొసావి అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమె నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌, పర్సును గుంజుకుని అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.క్యాబ్‌లో కూర్చున్న గొసావి స్నేహితుడు అతడికి సహకరించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.అనంతరం వారు బాధితురాలిని లాడ్జ్‌కు తీసుకురాని రాగా, తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆమె లాడ్జ్‌ మేనేజర్‌కు వివరించారని చెప్పారు.

దీనిపై లాడ్జ్‌ మేనేజర్‌ నిందితులను నిలదీయగా వారు అక్కడినుంచి పరారయ్యారని తెలిపారు. మహిళ ఫిర్యాదుపై గొసావి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అయితే సంఘటనతో తమకు సంబంధం లేదని ఓలా ఓ ప్రకటనలో పేర్కొంది.ఓలా ఫ్లాట్‌ఫాంపై ఈ నేరం జరగలేదని, విచారణ నిమిత్తం పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement