రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం

Published Fri, Apr 20 2018 2:10 PM

Brother And Sister Died In Road Accident - Sakshi

హనుమంతునిపాడు: రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని దొడ్డిచింతల–హాజీపురం మధ్య గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి చెందిన అంగిరేకుల కృష్ణయ్య (50), బోరెడ్డి చెన్న లక్ష్మమ్మ (45)లు సొంత అన్న, చెల్లి అవుతారు. కృష్ణయ్య కుమారుడి పెళ్లి నిశ్చయం కావడంతో బంధువులతో కలిసి సరుకుల కోసం కనిగిరి వచ్చారు.

అనంతరం తిరిగి ఆటోలో అగ్రహారం బయల్దేరారు. అదే గ్రామానికి చెందిన మారంరెడ్డి నాగిరెడ్డి ట్రాక్టర్‌లో పొగాకు చెక్కులు వేసుకుని కనిగిరి బోర్డుకు బయల్దేరాడు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయాడు. అయినా ట్రాక్టర్‌ డోరు ఆటోకు తగిలింది. కుడి వైపు కూర్చొని ఉన్న కృష్ణయ్య, చెన్నలక్ష్మమ్మలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

అందులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ హరిబాబు తెలిపారు 

Advertisement
 
Advertisement
 
Advertisement