రెండు భవనాల మధ్య యువతి మృతదేహం | Body Of Woman Found Stuck Between Residential Buildings At 120 Feet In Noida | Sakshi
Sakshi News home page

రెండు భవనాల మధ్య చిక్కుకున్న మృతదేహం

Jul 3 2019 1:27 PM | Updated on Jul 3 2019 1:40 PM

Body Of Woman Found Stuck Between  Residential Buildings At 120 Feet In Noida - Sakshi

యువతి మృతదేహం చిక్కుకున్న భవనం ఇదే

నోయిడా : 120 అడుగుల ఎత్తున్న రెండు భవనాల మధ్య 19 ఏళ్ల యువతి మృతదేహాం చిక్కుకున్నట్లు గుర్తించామని మంగళవారం పోలీసు అధికారులు తెలిపారు. నోయిడాలోని అమ్రపాలి సిలికాన్‌ సొసైటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే సొసైటీలో నివసిస్తున్న దంపతుల ఇంట్లో ఆ యువతి పని చేస్తుందని, ఆమె స్వస్థలం బీహార్‌లోని కత్తీహర్‌ జిల్లాగా గుర్తించామని తెలిపారు.  గత నెల జూన్‌ 28న యువతి పై మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు  పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని బయటికి తీయడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయం కోరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రెండు భవనాల మధ్య చిక్కుకున్న మృతదేహాన్ని 35 మంది టీంతో కలిసి దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి బయటకు తీసినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి జితేంద్ర కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ ఘటన పై ఇంకా ఎలాంటి వివరాలు తెలియదని అక్కడి పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు. కేసు నమేదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీస్‌ అధికారి అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ వెల్లడించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement