పుట్టే బిడ్డకు నాపేరు పెట్టండి | Auto Driver Suicide | Sakshi
Sakshi News home page

పుట్టే బిడ్డకు నాపేరు పెట్టండి

Mar 24 2018 9:31 AM | Updated on Nov 6 2018 8:22 PM

Auto Driver Suicide - Sakshi

సాగర్‌నగర్‌(విశాఖ తూర్పు):‘నా చావుకు ఎవ్వరూ కారణం కాదు.. నా ఆటో, సెల్‌ఫోన్‌ నా భార్యకు అప్పగించాలి.. నాకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టండి’అంటూ ఓ ఆటో డ్రైవర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకరమైన ఈ ఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ బ్రహ్మాజీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ–భీమిలి బీచ్‌ రోడ్డు ఇందిరా జూ పార్కు వెనక సాగర్‌ గేటు ఎదురుగా ఉన్న పొదల్లో బర్నాకాని మహేష్‌(23) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరిలోవ పోలీసులు గుర్తించారు.

ఈయన ఆరిలోవ 40 గజాల కాలనీ వాసి. కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య సంధ్య ప్రస్తుతం గర్భవతి. ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలంలో మహేష్‌ ‘నా చావుకు ఎవ్వరూ కారణం కాదు.. నాకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టండి’అంటూ సూసైడ్‌ నోటు రాసి ఉంచాడు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ బ్రహ్మజీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement