అమావాస్య గ్యాంగ్‌ అరెస్ట్‌ | Amavasya Gang Arrest in Karnataka | Sakshi
Sakshi News home page

అమావాస్య గ్యాంగ్‌ అరెస్ట్‌

Mar 15 2019 1:29 PM | Updated on Mar 15 2019 1:29 PM

Amavasya Gang Arrest in Karnataka - Sakshi

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న బైక్‌లు, పట్టుబడ్డ నిందితులు

దొడ్డబళ్లాపురం : అమావాస్య రోజే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తుమకూరు టౌన్‌ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్‌కుయార్‌లన అరెస్ట్‌ చేశారు. వీరు అమావాస్య రోజే బైక్‌ చోరీలకు పాల్పడ్డం విశేషం. నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల ఇళ్లల్లో ఉంచి కస్టమర్లను వెదికి విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహ ఎఫ్‌జడ్‌ బైక్‌ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు వారు దాచి ఉంచిన 13 ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వీరి గ్యాంగ్‌లో ఎవరెవరున్నారు?ఎ క్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement