పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి  | ACB Raids On RTO Check Post In Anantapur | Sakshi
Sakshi News home page

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

Sep 9 2019 10:28 AM | Updated on Sep 9 2019 10:28 AM

ACB Raids On RTO Check Post In Anantapur - Sakshi

వసూలు చేసిన మొత్తంతో ఏఎంవీఐ ప్రసాద్‌

సాక్షి, పెనుకొండ(అనంతపురం) : పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న రూ.53,410 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన సమాచారం మేరకు... ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో వసూలు చేసిన మొత్తంతో ఏఎంవీఐ ప్రసాద్‌ తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించగా.. ఏఎంవీఐ కేఎల్‌వీఎన్‌ ప్రసాద్‌ నుంచి లెక్కల్లో లేని రూ.30,510, అక్కడే ఉన్న ప్రైవేట్‌ వ్యక్తి శివారెడ్డి నుంచి రూ.22,900 స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తంగా రూ.53,410 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని రవాణాశాఖ అధికారి వాహనాల డ్రైవర్‌ల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖకు నివేదిక పంపుతామన్నారు. దాడుల్లో సిబ్బంది చక్రవర్తి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement