గాంధీ ఆస్తులపై ఏసీబీ ఆరా | ACB Investigation On Mallampati Gandhi Assets | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్తులపై ఏసీబీ ఆరా

Mar 21 2018 12:48 PM | Updated on Aug 17 2018 12:56 PM

ACB Investigation On Mallampati Gandhi Assets - Sakshi

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గాంధీకి సంబంధించిన భూముల రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌

జంగారెడ్డిగూడెం:లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఆరాతీశారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి గాంధీ, ఆయన బినామీల పేరున ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది రికార్డులు తనిఖీ చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో 4.50 ఎకరాలు, దిప్పకాయలపాడులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో కూడా ఏమైనా ఆస్తులు ఉన్నయా,  ఆయన బినామీలు ఎవరైనా ఉన్నారా అనేది ఆరా తీస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement