ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

4 killed in road accident near giddalur - Sakshi

కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద లారీ బోల్తా

కర్ణాటకకు చెందిన నలుగురు మృతి..

సుమారు 10 మందికి గాయాలు.. భద్రాచలం వెళ్తుండగా ఘటన

సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 10 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని చికమంగుళూరు జిల్లా సరిలి మండలానికి చెందిన 45 మంది భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం లారీలో బయల్దేరారు. కొమరోలు మండలం తంబళ్లపల్లి క్రాస్‌ వద్దకు వచ్చేసరికి లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నారాయణమ్మ, ఆదిమ్మ, మారెప్ప, వెంకటనర్సప్ప ఘటనాస్థలిలోనే మృతిచెందారు. గాయాలపాలైన çసుమారు 10 మందిని వెంటనే గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ, గిద్దలూరు సీఐ, ఎస్‌ఐలు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top