కారుతో ఢీకొట్టి ఇద్దరు జర్నలిస్ట్‌ల హత్య | Two Journalists Killed In Bihar By Local Leader | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి ఇద్దరు జర్నలిస్ట్‌ల హత్య

Mar 26 2018 11:06 AM | Updated on Mar 26 2018 11:06 AM

2 Journalists Killed In Bihar by Local Leader - Sakshi

పట్నా: దేశంలో రోజురోజుకు జర్నలిస్ట్‌ల హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్‌లో ఇద్దరు జర్నలిస్ట్‌లను స్థానిక నాయకుడొకరు కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. దైనిక్‌ భాస్కర్‌ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్‌ నిశ్చల్‌, విజయ్‌ సింగ్‌ అనే ఇద్దరు పాత్రికేయులు దారుణ హత్యకు గురైయ్యారు. పట్నాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్‌ హర్సు అనే స్థానిక నాయకుడు, తన కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవీన్‌, విజయ్‌ బైకుపై ఆరా ప్రాంతానికి వెళుతుండగా వీరి వాహనాన్ని మహ్మద్‌ హర్సు అతడి కుమారుడు స్కార్ఫియోతో ఢీకొట్టించారు.

నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. మహ్మద్‌ హర్సు ఇంతకుముందే వివిధ క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement