భక్తులతో తిరుమల కిటకిట

సాక్షి, తిరుమల: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 67,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top