సొంతింటికి విజన్! | vision for new home | Sakshi
Sakshi News home page

సొంతింటికి విజన్!

Apr 22 2016 11:08 PM | Updated on Sep 3 2017 10:31 PM

సొంతింటికి విజన్!

సొంతింటికి విజన్!

షాద్‌నగర్ కు అతిదగ్గర్లో ఆంబియెన్స్, గ్రీన్ ఎకర్స్ పేర్లతో భారీ వెంచర్లు చేస్తున్నామని స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహారెడ్డి చెప్పారు.

షాద్‌నగర్‌లో స్పేస్ విజన్ ప్రాజెక్ట్‌లు

 షాద్‌నగర్ కు అతిదగ్గర్లో ఆంబియెన్స్, గ్రీన్ ఎకర్స్ పేర్లతో భారీ వెంచర్లు చేస్తున్నామని స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహారెడ్డి చెప్పారు. మరిన్ని వివరాలివిగో..

600 ఎకరాల్లో ఆంబియెన్స్ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో డీటీసీపీ అనుమతి పొందిన 15 వేల ఓపెన్ ప్లాట్లొస్తాయి. 147 నుంచి 1,000 గజాల్లో ఉంటాయి. గజం ధర రూ.2,250.

కొనుగోలుదారులకు అవసరమైతే ఇళ్లను కూడా క ట్టిస్తాం. 50 ఎకరాల్లో నిర్మాణాలుంటాయి. ఒక్కో ఫ్లాట్ 147 గజాల్లో ఉంటుంది. ధర రూ.8-20 లక్షల మధ్య ఉంటాయి.

ఈ ప్రాజెక్ట్‌లో 10 ఎకరాల్లో క్లబ్‌హౌజ్ ఉంటుంది. 5 హోల్స్ గోల్ఫ్‌కోర్ట్ కూడా ఉంటుంది. ఆయుర్వేద వైద్యశాల, స్విమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులెన్నో ఉంటాయి. వాయిదాల రూపంలో ప్లాట్లను అందిస్తున్నాం. మొత్తం ఆరు దశల్లో ఆంబియెన్స్ ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తాం.

♦  భవిష్యత్తు అవసరాల రీత్యా ప్లాట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ఆదాయాన్ని చేకూర్చేందుకు గ్రీన్ ఎకర్స్ పేరుతో ఫాం ప్లాటింగ్ వెంచర్‌ను చేస్తున్నాం. పోలేపల్లి ఫార్మా సెజ్‌కు దగ్గర్లో 500 ఎకరాల్లో ఉందీ ప్రాజెక్ట్. ధర ఎకరానికి రూ.12 లక్షలు.

♦  గ్రీన్ ఎకర్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఎకరం విస్తీర్ణంలో 300 మలబార్, 25 రకాల పండ్లు, 25 శ్రీగంధం మొక్కలను పెంచుతాం. వీటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యత కంపెనీదే. అంతేకాకుండా చెట్లు కోతకొచ్చాక వాటి కొనుగోలు, ట్రేడింగ్ నిర్వహణకు గ్రీన్ అగ్రి అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.

♦  వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు వీలుగా 5 ఎకరాల్లో క్లబ్ హౌస్, గోశాల వంటి వసతులు కూడా ఉంటాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement