వాస్తు-శుభమస్తు | Sakshi
Sakshi News home page

వాస్తు-శుభమస్తు

Published Sat, Sep 20 2014 12:51 AM

వాస్తు-శుభమస్తు

 సాక్షి, హైదరాబాద్: ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది.

* కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది.
* పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది.
* ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు.
* పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి.
* నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు.
* తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు.
* పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement