హ్యాండిచ్చిన ట్విటర్‌ అధికారులు

Twitter CEO Top Officials Decline to Appear BeforeParl Panel - Sakshi

పార్లమెంటరీ ప్యానెల్‌ ముందు హజరయ్యేందుకు నిరాకరించిన ట్విటర్‌  సీఈవో

సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌  సమావేశానికి ట్వీటర్‌ సీఈవో, ఇతర అధికారులు గైర్హాజరు కానున్నారు. కమిటీ  ముందు  హాజరు కావడానికి తమకు సమయం తక్కువగా  వుందంటూ ఈ ప్రతిపాదనను  ట్విటర్‌  అధికారులు తిరస్కరించారు. ఈ మేరకు ట్విటర్‌ ప్రతినిధి విజయా గద్దే  ఫిబ్రవరి 7న బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ  పార్లమెంటరీ కమిటీకి ఒక లేఖ రాశారు. 

సామాజిక మాధ్యమ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణ కోసం లోక్‌సభ సభ్యుడు అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో ఒక  కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే సహా మరోటాప్‌ అధికారి హాజరు కావాలని పార్లమెంటరీ ఐటీ కమిటీ సమన్లు జారీ చేసింది.  వీరితో  ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధును కమిటీ ఆదేశించింది. ఫిబ్రవరి 1న సమావేశానికి హాజరు కావాలని కమిటీ అధికారిక లేఖ రాసింది. ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న సమావేశం అజెండాను ఠాకూర్ ట్వీట్‌ చేశారు. ఈ అంశంపై  సాధారణ ప్రజల అభిప్రాయాలు, సమీక్షలను కూడా  కోరతామని ఆయన పేర్కొన్నారు.  అయితే ఆ తరువాత ఈ సమాశం  ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది.    
 
కాగా సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై  చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ట్విటర్‌  డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను ఎదుర్కొంటోంది.  ఈ కోవలో అమెరికా, సింగపూర్‌, ఈయూ తర్వాత,  ఇండియా నాలుగదేశంగా నిలిచింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top