జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్ | Titan, Gitanjali Gems, PC Jeweller Surge On GST Boost | Sakshi
Sakshi News home page

జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్

Jun 5 2017 10:44 AM | Updated on Jul 29 2019 7:32 PM

జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్ - Sakshi

జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్

బంగారంపై జీఎస్టీ పన్ను రేటుపై గతకొంతకాలంగా సాగుతున్న సస్పెన్షన్ కు తెరదించడంతో జువెల్లరీ షేర్లు జిల్ జిగేల్ మంటున్నాయి..

బంగారంపై జీఎస్టీ పన్ను రేటుపై గతకొంతకాలంగా సాగుతున్న సస్పెన్షన్ కు తెరదించడంతో జువెల్లరీ షేర్లు జిల్ జిగేల్ మంటున్నాయి.. గోల్డ్ , బంగార ఆభరణాలపై 3 శాతం పన్ను వేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో జువెల్లరీ రిటైలర్ షేర్లు సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. జీఎస్టీ బూస్ట్ తో టైటాన్ కంపెనీ, పీసీ జువెల్లరీ, గీతాంజలి జెమ్స్, తారా జువెల్స్ షేర్లు 6 శాతం నుంచి 15 శాతం మధ్యలో ట్రేడవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన పన్ను రేట్లు తమకు ఆహ్వానించదగినగానే ఉన్నాయని జెమ్స్ అండ్ జువెల్లరీ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రస్తుతం జువెల్లరీ ఇండస్ట్రీ 2 నుంచి 2.5 శాతం పన్ను చెల్లిస్తోంది. జీఎస్టీ పన్ను 3 శాతం.
 
ఈ పన్ను రేటుతో జువెల్లరీ, బంగారం ఇండస్ట్రిపై ఎలాంటి ప్రభాముండదని డబ్ల్యూహెచ్పీ డైరెక్టర్ ఆదిత్య  పేథె చెప్పారు. ఈ పన్ను రేట్లు అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని సక్రమమైన మార్గంలో ట్రేడ్ నిర్వహించడానికి ప్రోత్సహిస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. బంగారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రోత్సహకరంగా ఉందని, లక్షల మంది పొట్టకూటిగా ఉన్న ఇండస్ట్రిని సుస్థిరంగా ఉంచేలా ఇది దోహదం చేస్తుందని వరల్డ్ గోల్డ్ కైన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరామ్ పీఆర్ చెప్పారు.  జువెల్లరీ తయారీదారుల ఇతర షేర్లు పీసీ జువెల్లరీ 8 శాతం జంప్ చేసింది. గీతాంజలి జెమ్స్, టాటా జువెల్స్ షేర్లు కూడా 8 శాతం పైగి ఎగిశాయి. ప్రారంభంలో నిఫ్టీ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ, ఈ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement