టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ పెరుగుతున్నాయ్

టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ  పెరుగుతున్నాయ్


గోద్రెజ్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్ ఉత్పత్తుల రేట్లు 2-5 శాతం వరకూ పెంపు...

న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెరగడం,  రూపాయి క్షీణతతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు అంటున్నాయి. గోద్రేజ్ అప్లయెన్సెస్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్, దైకిన్ తదితర కంపెనీలు ధరలను 2-5% రేంజ్‌లో పెంచుతున్నాయి.మోడళ్లను బట్టి తమ ఉత్పత్తుల ధరలు 3-5% వరకూ పెంచుతున్నట్లు హేయర్ ఇండియా తెలిపింది. కొత్త స్టాక్‌కు ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది. గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా ఇదే రేంజ్‌లో పెంచాలని భావిస్తోంది. వర్ల్‌పూల్ సంస్థ ఈ నెల మూడో వారం నుంచి ధరలను 2-3% పెంచనున్నది. దైకిన్ సంస్థ ఏసీల ధరలను 4%వరకూ పెంచుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top