టెక్‌ మహీంద్రా లాభం రూ.943 కోట్లు | Tech Mahindra's net profit was Rs 943 crore | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా లాభం రూ.943 కోట్లు

Jan 30 2018 1:38 AM | Updated on Jan 30 2018 1:38 AM

Tech Mahindra's net profit was Rs 943 crore - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల సంస్థ, టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.943 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.856 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలియజేసింది. 

ఆదాయం రూ.7,558 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,776 కోట్లకు పెరిగింది.  సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 13 శాతం, ఆదాయం 2 శాతం చొప్పున పెరిగాయి.   ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టెక్‌ మహీంద్రా షేర్‌ 1.1 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement