మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా | Tech Mahindra plans increasing global seating capacity by 30000 | Sakshi
Sakshi News home page

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

Dec 22 2014 12:33 PM | Updated on Sep 2 2017 6:32 PM

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

ఐటీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని కొత్తగా నియమించుకోనుంది.

హైదరాబాద్: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. తద్వారా సంస్థ ఉద్యోగుల సంఖ్య 1.25 లక్షలకు ఎగబాకనుంది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలతోపాటు వైజాగ్, జైపూర్, భువనేశ్వర్ కేంద్రాల్లో ఈ విస్తరణ ఉంటుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సి.పి.గుర్నాణి తెలిపారు.

‘వైజాగ్‌లో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. ఈ నగరంలో కంపెనీకి కొత్తగా స్థల కేటాయింపులు పూర్తి అయ్యాయి. భువనేశ్వర్‌లో మరో బ్లాక్‌ను జోడిం చాం. గత కొన్నేళ్లుగా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఆదాయాల్లో 2-3 శాతం ఇందుకోసం వ్యయం చేస్తున్నాం’ అని చెప్పారు. టెక్ మహీంద్రాకు హైదరాబాద్ కేంద్రం అతిపెద్దదని, ఈ కేంద్రంలో 20,000 మందికిపైగా పనిచేస్తున్నారని వివరించారు. ఇక్కడికి సమీపంలోని బహదూర్‌పల్లి ఫెసిలిటీలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటుకు సుమారు రూ.600 కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement