స్విగ్గీ చేతికి కింట్‌ ఐవో 

Swiggy makes first acqui hire of the year with AI startup Kint io - Sakshi

న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ కంపెనీ ‘కింట్‌ డాట్‌ ఐవో’ను స్విగ్గీ సొంతం చేసుకుంది. దీంతో కింట్‌ ఐవో వ్యవస్థాపకులు పవిత్ర సోలాని జవహర్, జగన్నాథన్‌ వీరరాఘవన్‌ స్విగ్గీ బృందంలో చేరతారని కంపెనీ తెలిపింది. తన ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపునకు ఈ కొనుగోలు చేసింది.

యూబీఎస్‌ మార్పులతో యమహా స్కూటర్లు 
న్యూఢిల్లీ: భారత నూతన ప్రమాణాలకు తగినట్లుగా తమ కంపెనీ స్కూటర్లను ఆధునికరిస్తున్నట్లు యమహా మోటార్‌ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకీకృత బ్రేకింగ్‌ వ్యవస్థను (యూబీఎస్‌) తమ స్కూటర్లలో అమర్చనున్నట్లు తెలియజేసింది. 125 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలకు ఈ వ్యవస్థ తప్పనిసరికావడంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ కంపెనీ చైర్మన్‌ మెటొఫుమీ షితార వివరించారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top