దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు | Super Plastronics explores manufacturing in South | Sakshi
Sakshi News home page

దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు

Jan 17 2019 5:13 AM | Updated on Jan 17 2019 5:13 AM

Super Plastronics explores manufacturing in South - Sakshi

అవనీత్‌ సింగ్‌ మార్వా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో కొడాక్, థామ్సన్‌ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉన్నాయని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్, థామ్సన్‌ బ్రాండ్లలో 2017–18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్‌ బ్రాండ్‌లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌కు 4 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం టాప్‌–2 ప్లేయర్‌గా ఉన్నాం’ అని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement