
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు క్షీణించి 39638 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు బలహీన పడి 11870 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్, ఎస్‌బ్యాంకు,డీఎహెచ్‌ఎఫ్‌ఎల్ నష్టపోతున్నాయి. ఓఎన్‌జీసీ, టాటాస్టీల్ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ రంగ షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, అదానీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకులు లాభపడుతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నిన్నటి ముగింపు 69.35తో పోలిస్తే గురువారం ఉదయం 69.37 వద్ద ట్రేడింగ్‌ను ఆరభించింది.