రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ | States meeting with the Centre on FDI retail | Sakshi
Sakshi News home page

రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ

Jul 15 2015 11:55 PM | Updated on Oct 4 2018 5:15 PM

రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ - Sakshi

రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ

మల్టీబ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం సమావేశం నిర్వహించింది...

న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం సమావేశం నిర్వహించింది. రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐల విషయంలో ఇటు చిన్న రిటైలర్లు, అటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం అన్నది దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రానికి రాష్ట్రాలు సూచించాయి. ఏది ఏమైనప్పటికీ దీనిపై రాష్ట్రాల స్థాయిలో సంబంధిత వర్గాలతో కూలంకుషంగా చర్చించిన తర్వాతే అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు హర్యానా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు తెలిపారు. అన్ని రాష్ట్రాలు 15 రోజుల్లోగా మల్టీబ్రాండ్ రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలపై తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలపాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement