ఎస్‌బీఐ కస్టమర్లకు తీపికబురు

 State Bank Of India (SBI) Hikes Interest Rate On Fixed Deposits - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మదుపరులకు తీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై  వడ్డీరేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు  ఎంపిక చేసిన  డిపాజిట్లపై 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచింది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు  మెచ్యూరిటీ డిపాజిట్లపై వర్తించే వడ్డీరేటును 6.65 శాతంగా నిర్ణయించింది. ఇప్పటి దాకా ఇది 6.4శాతంగా ఉంది. సీనియర్ పౌరుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఇంతకుముందు  ఇది 7.10 శాతంగా ఉంది.  ఈ  సవరించిన  రేట్లు మే 28 నుండి అమలులోకి   వచ్చినట్టు  బ్యాంకు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అయితే ఇతర మెచ్యూరిటీలకు వర్తించే  వడ్డీరేటును యథాతథంగా ఉంచింది. ఉదాహరణకు 45 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.75 శాతం, 46 -179 రోజులకు గాను 6.25 శాతం, 80-210 రోజుల  డిపాజిట్లపై 6.35 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. 211 రోజుల నుండి ఒక సంవత్సరం  లోపు వాటిపై 6.40 శాతంగానూ, మూడు సంవత్సరాల నుండి ఐదేళ్ల కాలానికి 6.70 శాతం, ఐదునుంచి పది సంవత్సరాల వరకు  డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీరేటును వర్తింప చేస్తుంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top