త్వరలో ‘టై’ అమరావతి చాప్టర్‌ | Soon 'tie' Amravati chapter | Sakshi
Sakshi News home page

త్వరలో ‘టై’ అమరావతి చాప్టర్‌

Oct 26 2017 12:55 AM | Updated on Aug 18 2018 3:49 PM

Soon 'tie' Amravati chapter - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యాపారవేత్తల సమాహారమైన ‘ద ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై)’ అమరావతి చాప్టర్‌ త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఎందియా పార్టనర్స్‌ ఎండీ సతీశ్‌ ఆండ్రా ప్రెసిడెంట్‌గా నవంబరులో ఈ చాప్టర్‌ లాంఛనంగా ప్రారంభమవుతుంది. వైజాగ్, తిరుపతి నగరాల్లో కూడా చాప్టర్లను ఏర్పాటు చేస్తామని టై బోర్డు సభ్యుడు, శ్రీనివాసా హేచరీస్‌ ఎండీ సురేశ్‌ చిట్టూరి బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, తయారీ, ఎంఎస్‌ఎంఈ రంగ కంపెనీలను టై అమరావతి ప్రోత్సహిస్తుందని చెప్పారు.

‘‘కళాశాలల స్థాయిలోనే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించేందుకు టాప్‌ కాలేజీలతో కలిసి పనిచేస్తాం. స్టార్టప్‌లకు ఆంధ్రా ఏంజెల్స్‌ నెట్‌వర్క్‌ నిధులు సమకూరుస్తుంది’’ అని సతీష్‌ ఆండ్రా వెల్లడించారు. వ్యాపార అవకాశాలు మెరుగు పరిచేందుకు మహిళా వ్యాపారవేత్తలకు చక్కని వేదికను రూపొందిస్తామని ఫాక్స్‌ మండల్‌ పార్టనర్‌ పూర్ణిమ కాంబ్లి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement