5.61 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు | Sensex tanks 335 pts in early trade; Infosys surges 5.61 percent | Sakshi
Sakshi News home page

5.61 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు

Oct 10 2014 10:43 AM | Updated on Sep 2 2017 2:38 PM

5.61 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు

5.61 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు

స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే బీఎసీ సూచి సెన్సెక్స్ 335, ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 106 పాయింట్లు పతనమైయ్యాయి.

ముంబై: స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే బీఎసీ సూచి సెన్సెక్స్ 335, ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 106 పాయింట్లు పతనమైయ్యాయి. వారాంతంలో మదుపుదారులకు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు.

అమెరికా, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండడంతో ఆ ప్రభావం మన మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 335 పాయింట్లు పడిపోయి 26,301 మార్క్ ను తాకింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 7,854 వద్ద కదలాడుతోంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ షేరు 5.61 శాతం పెరిగింది. కాగా, తమ వాటాదారులకు ఇన్ఫోసిస్ 1:1 బోనస్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement