మార్కెట్ల పతనం,10950 దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా పతనాన్నినమోదు చేశాయి. మిడ్సెషనఅనంతరం అమ్మకాలు ఊపందుకుకోవడంతో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయి 37వేల పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు దిగజారి 10,922 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. చివరికి సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 37,069 వద్ద, 98 పాయింట్లు క్షీణించి 10,987 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 11,000 పాయింట్ల కీలక మార్క్ దిగువనే ముగిసింది.
ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా రంగాలు నష్టపోగా ఫార్మా , మెటల్, రియల్టీ లాభపడ్డాయి. సన్ ఫార్మా 5 శాతం జంప్‌చేయగా.. ఇన్‌ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఐషర్, ఐవోసీ, గెయిల్ ఇతర టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు యస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, యాక్సిస్, ఐటీసీ, ఆర్‌ఐఎల్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, ఐసీఐసీఐ నష్టపోయాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా మరోసారి బలహీనపడింది. డాలరు మారకంలో 72 స్థాయికి పతనమైంది.బంగారం వెండి ధరలు మాత్రం తమ పరుగును కొనసాగిస్తున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి