
అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
ముంబై : స్టాక్ మార్కెట్లను నష్టాలు వీడటం లేదు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. రియల్టీ షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, టాటా స్టీల్, హిందుస్ధాన్ యూనిలివర్, వేదాంత, కొటక్ మహాంద్ర బ్యాంక్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. ఇక 101 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 37,535 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 31 పాయింట్లు నష్టపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,073 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.