అవసరాన్ని బట్టి కూలింగ్... | Sakshi
Sakshi News home page

అవసరాన్ని బట్టి కూలింగ్...

Published Thu, May 12 2016 1:26 AM

అవసరాన్ని బట్టి కూలింగ్...

శాంసంగ్ నూతన రిఫ్రిజిరేటర్లు
ధరల శ్రేణి రూ.15-82 వేలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ నూతన శ్రేణి ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. వీటిలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ల విభాగంలో స్మార్ట్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 శ్రేణిలో 393-670 లీటర్ల మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.45,000-82,500 మధ్య ఉంది. ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో రూపొందిన ఈ రిఫ్రిజిరేటర ్ల కూలింగ్ స్థాయిని కస్టమర్లు అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఫ్రిజ్, ఫ్రీజర్‌కు వేర్వేరు ఎయిర్‌ఫ్లోస్ ఉన్నాయి.

దీంతో చేపల వంటి ఉత్పత్తుల వాసన మరొక ఉత్పాదనకు సోకదు.ఆహారోత్పత్తులు 7 రోజుల దాకా తాజాగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. వీటితోపాటు స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ విభాగంలో 192-230 లీటర్ల సామర్థ్యంతో రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టారు. ప్రారంభ ధర రూ.15,100. రిఫ్రిజిరేటర్ల విపణిలో తమకు 40.5% వాటా ఉందని శాంసంగ్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా 8 పోల్ మోటార్‌తో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో కూడిన ఏసీలను కంపెనీ రూపొందించింది.

 సంప్రదాయ ఏసీలతో పోలిస్తే 43% వేగంగా చల్లబరుస్తుంది. బయటి వాతావరణం 58 డిగ్రీలున్నా గదిని కూల్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఏసీల్లో అంతర్గతంగా స్టెబిలైజర్‌ను పొందుపరిచారు. రూమ్ ఏసీ విభాగంలో 49 రకాలను రూ.30,800-67,000 ధరలో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement