ఆర్‌ఐఎల్‌..‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌! | RIL future and signals | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎల్‌..‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

Aug 11 2017 2:11 AM | Updated on Sep 17 2017 5:23 PM

ఆర్‌ఐఎల్‌..‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

ఆర్‌ఐఎల్‌..‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌లో భాగంగా మన మార్కెట్‌ కూడా గురువారం బాగా తగ్గింది. ఐటీ షేర్లు మినహా దాదాపు బ్లూచిప్‌ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి.

ఈ రోజు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో (ఎఫ్‌అండ్‌ ఓ) ఏ షేర్లయితే బెటర్‌?
ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

ఆర్‌ఐఎల్‌..
ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌లో భాగంగా మన మార్కెట్‌ కూడా గురువారం బాగా తగ్గింది. ఐటీ షేర్లు మినహా దాదాపు బ్లూచిప్‌ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద ర్యాలీ జరిపిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా 1 శాతం క్షీణతతో రూ. 1,584 వద్ద క్లోజయ్యింది. స్పాట్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ పరిమాణం తక్కువగా నమోదుకాగా, ఫ్యూచర్‌ కాంట్రాక్టు నుంచి 4.71 షేర్లు (3.59 శాతం) కట్‌ అయ్యాయి. ఫ్యూచర్‌ ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ) 1.26 కోట్లకు తగ్గింది. గురువారం నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీలతో సహా దాదాపు అన్ని స్టాక్‌ ఫ్యూచర్ల నుంచి కొంతవరకూ లాంగ్‌ అన్‌వైండింగ్‌ జరిగింది. అయితే పలు షేర్ల ఫ్యూచర్‌ ప్రీమియంలు తగ్గగా, ఆర్‌ఐఎల్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ప్రీమియం పెరిగింది. 

ఆర్‌ఐఎల్‌ స్పాట్‌ ధరతో పోలిస్తే ఫ్యూచర్‌ ప్రీమియం క్రితంరోజుకంటే నాటకీయంగా రూ. 2 నుంచి రూ. 9కి పెరిగింది. ఓఐ తగ్గుతూ...ప్రీమియం పెరగడం షార్ట్‌ కవరింగ్‌ కార్యకలాపాల్ని సూచిస్తోంది. రూ. 1,600, 1,620 స్ట్రయిక్స్‌ వద్ద స్వల్పంగా కాల్‌ రైటింగ్‌ జరగడంతో వీటివద్ద కాల్‌ బిల్డప్‌ 6.86 లక్షలు, 6.64 లక్షల షేర్లకు పెరిగింది. కానీ 1,640 స్ట్రయిక్‌ వద్ద కాల్‌ కవరింగ్‌ కారణంగా బిల్డప్‌ నుంచి లక్ష షేర్లు తగ్గగా, బిల్డప్‌ 8.08 లక్షల షేర్లకు దిగింది. ఈ ట్రెండ్‌ షేరుకి నిరోధస్థాయి రూ. 1,640 నుంచి దిగువ శ్రేణి రూ. 1,600–1,620 వద్దకు తగ్గుతుందని కాల్‌రైటర్లు భావించడం కారణం కావొచ్చు.

రూ. 1,600 స్థాయికి 1 % దిగువన షేరు ముగిసినా, ఆ స్ట్రయిక్‌ వద్ద పుట్‌ బిల్డప్‌ నుంచి కేవలం 39 వేల షేర్లు కట్‌ అయ్యాయి. ఇక్కడ 5.50 లక్షల పుట్‌ బిల్డప్‌ వుంది. రూ. 1,580 స్ట్రయిక్‌ వద్ద కూడా 39 వేల పుట్స్‌ కట్‌కాగా, బిల్డప్‌ 5.50 లక్షలకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,580పైన స్థిరపడితే రూ. 1,600–1,620 శ్రేణిని చేరవచ్చని, రూ. 1,580 స్థాయి దిగువన కొనసాగితే క్రమేపీ క్షీణించవచ్చని ఈ ఆప్షన్‌ డేటా వెల్లడిస్తున్నది.

బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ సంకేతాలు ఎలా వున్నాయి?  ఈ వివరాలు www.sakshibusiness.comలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement