వృద్ధి రేటును తగ్గించిన మరో సంస్థ

 Reuters Poll Estimates India GDP May Sink To 4.7 Percentage  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  భారత ఆర్థిక వ్యవస్థపై రాయటర్స్‌ పోల్‌ అధ్యయనం చేసింది. ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో పలు కీలక అంశాలను వెల్లడించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా వృద్ధిరేటు తగ్గుదల కనిపించబోతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో (2019-2020) 4.7శాతం వృద్ధి రేటు నమోదవుతుందని తెలిపింది. వినియాగదారుల డిమాండ్‌, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గడం, ప్రపంచ మందగమనం వల్ల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక తెలిపింది.

ఆర్‌బీఐ రెపోరేట్లను మరోసారి 25 బీపీఎస్‌ పాయింట్ల ద్వారా 4.90శాతం తగ్గిస్తుందని అంచనా వేసింది.  అయితే ఇప్పటి వరకు ఆర్‌బీఐ రెపోరేటును ఆరోసారి తగ్గించడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో రేటు అన్న విషయం తెలిసిందే. వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంటుందని, మారిన కేంద్ర బ్యాంక్‌ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు రేటింగ్‌ సంస్థలు భారత వృద్ధిరేటును తగ్గించడం వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top