రియల్‌ మి 2 వచ్చేసింది..ధర, స్పెసిఫికేషన్స్‌

Oppo Realme  2 launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన  రియల్‌ మి 2  భారత మార్కెట్లో మంగళవారం లాంచ్‌ అయింది. రియల్‌ మి 1 డివైస్‌ భారీ విక్రయాలను నమోదు చేయగా  దీనికి సక్సెసర్‌గా రియల్‌ మి2ను  రెండు వేరియంట్లలో కంపెనీ తాజాగా లాంచ్‌ చేసింది.  అందరూ ఊహించినట్టుగానే బడ్జెట్‌ ధరలోనే దీన్ని విడుదల చేసింది.  బేసిక్‌  మోడల్‌ను రూ. 8,990 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.  అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి  వేరియంట్‌ ధర రూ.10,990గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది.

రియల్‌ మి 2 ఫీచర్లు
6.20 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
19:9 యాస్పెక్ట్ రేషియో
1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే  సదుపాయం
720x1520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
13+2ఎంపీ  డ్యుయల్‌రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230ఎంఎహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top