ఒప్పో ఎఫ్‌9 ప్రొ : విత్‌ వూక్‌ ఫ్లాష్‌ చార్జ్‌

Oppo F9 Pro Launching Specifications, Feature expectations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఒప్పో ఎఫ్‌9 ప్రొ పేరుతో ఈ  స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేయనుంది. సరికొత్త ఫీచర్స్ తో అధునాతనమైన టెక్నాలజీ తో యూజర్లను మురిపించబోతుంది. వూక్‌ ఫ్లాష్‌ చార్జ్‌  5 నిమిషాల చార్జింగ్‌  2 హవర్స్‌ టాక్‌ అంటూ  సరికొత్త టెక్నాలజీతో ఈ డివైస్‌ను లాంచ్‌ అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ఫోన్ ను తయారు చేసామని కంపెనీ తెలిపింది. భారీ స్క్రీన్‌, భారీ సెల్పీ (25ఎంపీ) కెమెరాతో వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30లకు  భారత మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది.  ఒప్పో ఎఫ్‌9 ప్రొ ధర సుమారు రూ. 23,300  గా ఉంటుందని అంచనా.  అలాగే ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

6.3 అంగుళాల డిస్‌ప్లే
2280 x 1080 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
16+2 ఎంపీ రియర్‌ కెమెరా
25ఎంపీ  సెల్ఫీ కెమెరా (ఏఐ ఫీచర్స్‌)
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top