వైర్ల ఎంపికలో జాగ్రత్త 

Only products of certified companies must be purchased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి ఎంపికలో ధర, ప్రాంతమే కాదండోయ్‌.. నిర్మాణ సామగ్రి వినియోగం కూడా ప్రధానమైనదే. మరీ ముఖ్యంగా ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్‌ వైర్లు, పవర్‌ బోర్డులు.. నాసిరకం ఉత్పత్తులను వాడినా లేక ఎంపికలో ఏమరపాటుగా ఉన్నా సరే జరిగే ప్రమాదం ఊహించలేనిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వైర్ల ఎంపికలో నిపుణుల సలహాలివే.. 

►ధర విషయంలో రాజీ పడకుండా నాణ్యతకు సంబంధించి సర్టిఫై చేసిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. 

►విద్యుత్‌ షాక్‌లకు ఆస్కారం లేకుండా అవసరమైన ఎర్తింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. 

►కన్జ్యూమర్‌ యూనిట్‌పై ఉండే మెయిన్‌ స్విచ్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయాలి. 

►ప్రతి పవర్‌ బోర్డ్‌లో విడిగా ఫ్యూజ్‌ లేదా మినీ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఎంసీబీ) వంటి ట్రిప్పింగ్‌ పరికరాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగితే ఇవి వెంటనే యాక్టివేట్‌ అవుతాయి. 

► అవసరమైన దానికంటే ఎక్కువ కనెక్షన్లను ఇవ్వొద్దు. పవర్‌ సప్లయి కార్డ్‌ను నీళ్లు, వేడి ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top