సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ఉల్లి | Onion prices skyrocket to Rs 80/kg in Delhi  | Sakshi
Sakshi News home page

ఘాటెక్కిన ఉల్లి

Nov 28 2017 3:11 PM | Updated on Nov 28 2017 3:32 PM

Onion prices skyrocket to Rs 80/kg in Delhi  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి రిటైల్‌ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు గృహిణులకు భారమవుతుంటే తాజాగా దేశ రాజధానిలో కిల్లో ఉల్లి రూ 80కి ఎగబాకింది. ఇతర మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ 50 నుంచి రూ 70 పలుకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆజాద్‌పూర్‌ మండీలో మంగళవారం కిలో ఉల్లి రూ 80కి చేరిందని వ్యాపారులు చెప్పారు.

ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ర్ట, కర్ణాటక,మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి సరఫరాలు తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరొందిన మహారాష్ర్టలోని లాసాల్గావ్‌ మండీకి ఉల్లి సరఫరాలు 12,000 క్వింటాళ్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే రోజు మార్కెట్‌కు ఏకంగా 22,933 క్వింటాళ్ల సరుకు వచ్చింది. ఇదే మార్కెట్‌లో గత సంవత్సరం కేవలం రూ 7.50గా ఉన్న కిలో ఉల్లి ప్రస్తుతం రూ 33కు ఎగబాకింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement