నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ  | NSE launches trading in weekly options on Nifty 50 Index | Sakshi
Sakshi News home page

నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ 

Feb 12 2019 1:30 AM | Updated on Feb 12 2019 1:30 AM

NSE launches trading in weekly options on Nifty 50 Index - Sakshi

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు తమ పోర్టిఫోలియో రిస్కును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు.. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మరో అదనపు హెడ్జింగ్‌ సాధనం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రధాన సూచీలో తాజాగా వారాంత ఆప్షన్లను నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రారంభించింది. మూడు నెలలు, త్రైమాసికం, అర్థ సంవత్సరాంత ఆప్షన్లకు సరసన వీక్లీ ఆప్షన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ విక్రం లిమాయే వెల్లడించారు.

ఈయన మాట్లాడుతూ.. ‘నిఫ్టీ 50 ఇండెక్స్‌ డెరివేటీవ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఈ ప్రధాన సూచీ ఎక్సే్ఛంజ్‌ ప్లాగ్‌షిప్‌ ఇండెక్స్‌.’ అని అన్నారు. ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో వీక్లీ ఆప్షన్లకు కూడా సెబీ వద్ద నుంచి ఎన్‌ఎస్‌ఈ అనుమతి పొందిన విషయం తెలిసిందే కాగా, ఈ సూచీ ట్రేడింగ్‌ను సైతం త్వరలోనే ప్రారంభించనుందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement