మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’

Make My Trip Short Stace - Sakshi

గంటల చొప్పున అద్దెకు హోటళ్లు: పరిక్షిత్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయ బోతోంది. సాధారణంగా ఏ హోటల్‌కు వెళ్లినా గది అద్దె 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్‌ స్టేస్‌ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్‌ మై ట్రిప్‌ ఇండియా హోటల్స్‌ విభాగం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పరిక్షిత్‌ చౌదరి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.

పైలట్‌ విజయ వంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందు బాటులోకి తెస్తామని వెల్లడించారు. చార్జీ ఒక రోజుతో పోలిస్తే నాలుగు గంటలకు 20–30 శాతం ఉంటుందని చెప్పారు. కస్టమర్‌తోపాటు హోటల్‌ యజమానికి కూడా ఈ విధానం కలిసి వస్తుందని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top