
హైదరాబాద్: అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ జ్యువెలరీ గ్రూపుల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక ఆన్‌లైన్ సౌలభ్యతను ప్రవేశపెట్టింది. ఈ నెల 26వ తేదీలోపు www.josalukkasonline.com ద్వారా ముందు గా బుక్ చేసుకుని ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. బుక్ చేసుకున్నప్పుడు, అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ జారీచేస్తారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కస్టమర్లు తమ ఆభరణాలను దగ్గరలోని జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌లలో తీసుకోవచ్చు. లేదా ఇంటి వద్దే డెలివరీ చేసుకోవచ్చు. బంగారు నగల తరుగుపై 20%, వజ్రాలపై 20% తగ్గింపు సంస్థ ఇస్తున్న ఆఫర్లలో కొన్ని.