పిస్తా హౌస్‌తో జియో భాగస్వామ్యం

Jio Tie Up With Pista House - Sakshi

జియోఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు

సాక్షి, హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా పిస్తా హౌస్, రిలయన్స్ జియోలు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి హలీం డిస్కౌంట్ కూపన్లను అందిస్తుంది. వినియోగదారులు ఈ డిస్కౌంట్ కూపన్ తో హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన పిస్తా హౌస్ కౌంటర్లలో హలీంను కొనుగోలు చేయవచ్చు.

కొనసాగుతున్న ‘జియోఫోన్’ జోరు
ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు 'జియోఫోన్' స్మార్ట్ ఫీచర్ ఫోన్ తో మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. కేవలం రూ.49 లకే నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. గ‌తంలో ఇతర ఫీచర్‌ ఫోన్‌లను ఉపయోగించి కేవ‌లం వాయిస్ కాల్స్‌ మాత్రమే చేసేవారు. కానీ జియో ఫీచ‌ర్ ఫోన్‌లో వినియోగ‌దారులు వీడియో కాల్స్‌తో పాటు, ఉచిత టీవీ సౌకర్యం కూడా ఆనందిస్తున్నారని జియో తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top