సంక్షోభం నుంచి బయటపడేందుకు జెట్‌ కసరత్తు 

Jet Airways falls 5% on reports of SBI planning to move NCLT    - Sakshi

మళ్లీ లాభాల్లోకి మళ్లుతామని ధీమా     

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రైవేట్‌ విమానయాన దిగ్గజం జెట్‌ ఎయిర్‌వేస్‌ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకులు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేసేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రణాళిక అమలు ద్వారా మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని ధీమా వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ , సంస్థలో వాటాలు ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో టోనీ డగ్లస్‌ సోమవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక సంక్షోభం, రుణభార సమస్యలు ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రుణాలను ఈక్విటీ కింద మార్చే ప్రతిపాదనకు గత వారం సంస్థ షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. మరోవైపు, జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి బాకీలు రాబట్టుకునే అంశంపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని  ఎస్‌బీఐ సోమవారం తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top