జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా..

Japan Central Bank Gets First Woman Executive Director After 138 years - Sakshi

టోక్యో: సుమారు 138 ఏళ్ల తర్వాత జపాన్ సెంట్రల్ బ్యాంక్ తొలిసారి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించింది. కరోనా కారణంగా జపాన్‌లో అర్థిక వ్యవస్థ దిగజారడంతో తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ఆరుగురితో కూడిన అధికార బృందం బాధ్యత చేపట్టింది. ఈ అధికారుల బృందంలో టోకికో షిమిజు(55) ఒకరు. ఇకనుంచి రోజువారి బ్యాంక్‌ కార్యకలాపాలను చూసే బాధ్యత ఈ ఆరుగురు సభ్యులదే. ఈ క్రమంలో టోకికోను బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. కాగా టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో బ్యాంకు ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాక ఫైనాన్షియల్ మార్కెట్స్, విదేశీ మారక కార్యకలాపాలను కూడా ఆమె చూసుకునేవారు. అనంతరం 2016 నుంచి 2018 మధ్య లండన్‌ ప్రధాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు.

కాగా జపాన్‌ సెంట్రల్ బ్యాంక్‌లో మహిళ ఉద్యోగులు 47శాతం ఉండగా.. సీనియర్ మేనేజిరియల్ పోస్టులలో కేవలం 13శాతం,  న్యాయ వ్యవహారాలు, చెల్లింపు వ్యవస్థలు, బ్యాంక్ నోట్లతో వ్యవహరించే నిపుణుల స్థానాల్లో కేవలం 20శాతం మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కాగా 1998లో ప్రారంభించిన సెంట్రల్‌ బ్యాంకు పాలసీ బోర్డులో ద్రవ్వ విధానాన్ని రూపొందించే బోర్డు పాలసీలో అత్యున్నత స్థాయి నిర్ణయాలకు తీసుకునే బాధ్యతలో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ బోర్డులో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో ఒకరు మాత్రమే మహిళ సభ్యురాలు ఉంటారు. 

ఇక గత దశాబ్ధాల నుంచి అక్కడి పురుషులకు సమానంగా మహిళలు ఉన్నత చదువులను అభ్యసిస్తూ కీలక రంగాల్లో పదవులు పొందుతున్నారు. దీంతో దశాబ్దాలుగా జపాన్‌లో కొనసాగుతున్న పురుషుల ఆధిపత్యానికి సవాలుగా మహిళలుగా నిలవడం ప్రారంభమైంది. జపాన్ జనాభాలో మహిళలు 51 శాతం ఉండగా..  2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 153 దేశాలలో జపాన్‌ 121వ స్థానంలో ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top