తెలంగాణలో 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ | ITC to invest Rs 8,000 crore in Telengana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ

Jun 15 2015 4:43 AM | Updated on Sep 3 2017 3:45 AM

తెలంగాణలో 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ

తెలంగాణలో 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు రూ.8 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ తెలిపారు...

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు రూ.8 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలోని పేపర్ బోర్డు మిల్లు విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో రూ.800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో రూ.1,000 కోట్లతో ఐటీసీ హోటల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

నియామకాలు
- ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ
- ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్?
- మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తాజాగా ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని, కుమారుడు జేమ్స్‌కి (42) పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.
- ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉమాంగ్ నరులా నియమితులయ్యారు
- ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఎంట్రప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్’గా ఐటీ రంగ నిష్ణాతుడు రవి గరికపాటి నియమితులయ్యారు.
- ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement