ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా? | Huawei smartwatch launched, priced at Rs 22,999; available only on Flipkart | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా?

Apr 12 2016 12:24 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఈ  స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా? - Sakshi

ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా?

స్మార్ట్ మొబైల్స్ కు తోడుగా ఇపుడు స్మార్ట్ వాచీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్‌ కంపెనీ హువాయ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

న్యూఢిల్లీ:  స్మార్ట్ ఫోన్లకు తోడుగా ఇపుడు స్మార్ట్ వాచీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్‌ కంపెనీ హువాయ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచీని భారత్‌లో లాంచ్ చేసింది. ప్రీమియం సఫైర్ క్రిస్టల్ పూతతో తయారుచేసిన ఈ వాచీ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా.. డిఫరెంట్ ఆప్షన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఐపీ67గా పిలుస్తున్న ఈ స్మార్ట్ వాచీ బేస్ మోడల్ ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, లెదర్ స్ట్రాప్ తో వస్తున్న ఈ వాచీ నీళ్లలో పడినా ఏమీ కాదు. వై-ఫై లేదా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ వాచీని స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవడం దీని స్పెషాలిటీ. మోటో 360, (సెకండ్ జనరేషన్), శామ్‌సంగ్ గేర్ ఎస్2, యాపిల్ వాచ్ వంటి ప్రముఖ వాచీలకు పోటీగా విడుదలైన ఈ హువాయ్ స్మార్ట్‌వాచ్‌ కొనాలంటే మాత్రం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యం.  సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో  అందుబాటులో వున్న దీన్ని త్వరలోనే వివిధ నగరాల్లో అందుబాటులో ఉంచేలా యోచిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఐపీ67 స్పెసిఫికేషన్స్
సఫైర్ క్రిస్టల్ లెన్స్‌ హువాయ్ స్మార్ట్‌వాచ్ సఫైర్ క్రిస్టల్ లెన్స్‌తో కూడిన 1.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (400x400పిక్సల్స్). నీటిలో పడినా పాడవ్వకపోవడంతో పాటు, దుమ్మును కూడా తట్టుకుంటుందని చెబుతున్నారు. 1.4 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తిమంతమైన డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్‌వాచీలో పొందుపరిచారు. ఇంటర్నల్ స్టోరేజ్ 512 ఎంబి ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ ఆఫ్షన్స్‌తో వాచ్ హార్డ్‌వేర్ విభాగం బలోపేతంగా ఉంటుంది. దీంతో ఈ వాచ్ స్టోరేజ్ స్పేస్‌లో బోలెడన్ని యాప్స్ భద్రపరచుకోవచ్చు హార్ట్‌రేట్ మానిటర్‌ 6- యాక్సిస్ మోషన్ సెన్సార్, బారో మీటర్‌తో పాటు హార్ట్‌రేట్ మానిటర్‌,  వై ఫై, మైక్రోఫోన్, స్పీకర్, 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్, బ్లాక్‌తో పాటు అనేకరకాల కలర్ వేరియంట్‌లలో హువాయ్ స్మార్ట్‌వాచ్ లభ్యం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement