ఐ ఫోన్‌ ఎక్స్‌కు చెక్‌ పెట్టేలా హువాయ్‌ స్మార్ట్‌ఫోన్లు | Huawei Mate 10, Mate 10 Pro With FullView Displays, MobileAI Launched | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్‌ ఎక్స్‌కు చెక్‌ పెట్టేలా హువాయ్‌ స్మార్ట్‌ఫోన్లు

Oct 16 2017 8:36 PM | Updated on Nov 6 2018 5:26 PM

Huawei Mate 10, Mate 10 Pro With FullView Displays, MobileAI Launched - Sakshi

బీజింగ్‌: చైనా దిగ్గజం హువాయి అమెరికన్‌ మొబైల్‌ దిగ్గజం ఆపిల్‌కు చెక్‌పెట్టేలా సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ముఖ‍్యంగా ఆపిల్‌ ఇటీవల  విడుదల చేసిన ఐ ఫోన్‌ 8, 8ప్లస్‌, X కు ధీటుగా రెండు డివైస్‌లను ప్రవేశపెట్టింది.  హువాయి మాట్‌10, మాట్‌ 10 ప్రొ  లను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ యు ఆవిష్కరించారు.  అంతేకాకుండా,  హువాయి పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10 కూడా ఆవిష్కరించారు.   స్మార్ట్‌ఫోన్లలో అత్యంత అధునాతన చిప్సెట్‌ తో వీటిని రూపొందించామనీ ఇది చాలా శక్తివంతమైందనీ, అల్టిమేట్‌ పెర్‌ఫామెన్స్‌, ఇంటిలిజెన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌  అందిస్తాయనీ యు  పేర్కొన్నారు.

హువాయ్‌ 10 ధర దాదాపు రూ .53,400గాను, 10 ప్రో  ధరను దాదాపు రు .61,000గాను నిర్ణయించింది.  మాట్ 10 ప్రోను రెండు వేరియంట్లలో (4 జీబీర్యామ్‌,  64 జీబీ అంతర్గత నిల్వ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ అంతర్గత నిల్వ ) లాంచ్‌ చేసింది. పరిమితమార్కెట్లలో అందుబాటులో ఉండే పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10   దాదాపు రూ.1,6,6,600లకు  లభ్యం కానుంది. డైమండ్‌ బ్లాక్‌కలర్‌లో  6జీబీ ర్యామ్‌/ 256జీబీ లభ్యమవుతుందని  కంపెనీ ప్రకటించింది. నవంబరు నుంచి ఆస్ట్రేలియా, చైనా, ఈజిప్ట్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్,యూఏఈ దేశాల్లో విక్రయాలు మొదలుకానున్నాయి. అలాగే  యూరోప్ మరియు ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో కూడా ఉండనుంది. ప్రయోగ మార్కెట్లలో దాదాపు రూ.1,6,6,600 వద్ద అందుబాటులో ఉంచింది.   

మాట్‌ 10, 10 ప్రో రెండూ రెండూ ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో,  స్వదేశీ HiSilicon Kirin 970 SoC ఆధారితమైనవి,  న్యూయరల్-నెట్వర్క్ ప్రాసెసర్ యూనిట్ (NPU) ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్   చిప్‌ సెట్‌  అని కంపెనీ చెబుతోంది. అలాగే ఐ ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ మిస్‌అయితే హువాయి మాత్రం ఈరెండు రెండు ఫోన్లలనో  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ జత చేర్చింది.  దీంతో ఆపిల్‌ తరహా స్లిమ్మెర్ బాడీతో, బయోనిక్  స్వంత డ్యూయల్ కోర్ 'నారల్ ఇంజిన్' మద్దతుతో వస్తున్న ఆపిల్‌ ఐఫోన్లకు గట్టిపోటీ   ఇస్తాయని మొబైల్‌ నిపుణులు భావిస్తున్నారు. 


హువాయ్‌ మాట్‌ 10 ప్రో 
6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌
4 జీబీ/64 జీబీ అంతర్గత నిల్వ, 
6జీబీ ర్యామ్‌/ 128జీబీ 
 20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 
12 మెగాపిక్సెల్ ఆర్‌జీబీ సెన్సార్
8 ఎంపి సెల్ఫీ కెమెరా
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 

హువాయ్‌ మాట్‌ 10
 5.9 అంగుళాల డిస్‌ఫ్లే
 1440x2560 పిక్సల్స్ రిజల్యూషన్ 
4జీబీ ర్యామ్‌, 
64 జీబీ స్టోరేజ్‌ 
256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 

12 మెగాపిక్సెల్ ఆర్‌జీబీ సెన్సార్
8 ఎంపి సెల్ఫీ కెమెరా
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement