వైకింగ్‌ బ్రాండ్‌ మళ్లీ తెస్తున్న హీరో సైకిల్స్‌

Hero Cycles again bringing Viking brand - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్‌’ తాజాగా బ్రిటన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన  మోస్ట్‌ పాపులర్‌ సైకిల్‌ బ్రాండ్‌ ‘వైకింగ్‌’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్‌ బ్రాండ్‌ను కలిగిన అవోసెట్‌ సైకిల్స్‌ను 2015లో హీరో సైకిల్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్‌ షాప్స్‌లో వైకింగ్‌ బ్రాండ్‌ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి.

‘‘యాజమాన్యం మార్పు సహా పలు అంశాల కారణంగా దశాబ్దాల నుంచి వైకింగ్‌ బ్రాండ్‌ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. హీరో సైకిల్స్‌ మా సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి యూకే మార్కెట్‌పై ప్రభావం చూపించాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది’’ అని ఎవోసెట్‌ సీఈవో శ్రీరామ్‌ వెంకటేశ్వరన్‌ తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top