breaking news
Vikings
-
వైకింగ్ బ్రాండ్ మళ్లీ తెస్తున్న హీరో సైకిల్స్
న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్’ తాజాగా బ్రిటన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన మోస్ట్ పాపులర్ సైకిల్ బ్రాండ్ ‘వైకింగ్’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్ బ్రాండ్‌ను కలిగిన అవోసెట్ సైకిల్స్‌ను 2015లో హీరో సైకిల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్ షాప్స్‌లో వైకింగ్ బ్రాండ్ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ‘‘యాజమాన్యం మార్పు సహా పలు అంశాల కారణంగా దశాబ్దాల నుంచి వైకింగ్ బ్రాండ్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. హీరో సైకిల్స్ మా సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి యూకే మార్కెట్‌పై ప్రభావం చూపించాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది’’ అని ఎవోసెట్ సీఈవో శ్రీరామ్ వెంకటేశ్వరన్ తెలిపారు. -
300 అస్థిపంజరాలు వైకింగ్ ఆర్మీవే
ఇంగ్లండ్ : ప్రపంచంలోని అతిగొప్ప ఆర్మీల్లో ఒకటిగా భావించే వైకింగ్ ఆర్మీకి చెందిన కొత్త వివరాలు తాజా పరిశోధనల్లో బయల్పడ్డాయి. డెర్బీషైర్‌లోని ఓ ప్రాంతంలో లభ్యమైన మూడు వందలకు పైగా అస్థిపంజరాలు వైకింగ్స్ వీరులవని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ఆర్కియాలజిస్టులు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఈ అస్థిపంజరాలను తొలిసారిగా 1980ల్లో గుర్తించారు. కాగా, అవి ఏ కాలానికి చెందినవో సరిగ్గా అంచనా వేయడానికి ఇంత సమయం పట్టింది. తొమ్మిదవ శతాబ్దంలో జరిగిన ఓ యుద్ధంలో 300 మంది వైకింగ్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో వీర మరణం పొందిన వైకింగ్ సైనికుల మృతదేహాలను మిగతా సైనికులు డెర్బీషైర్‌లో పూడ్చిపెట్టారని పరిశోధన పేర్కొంది. 872 నుంచి 875 కాలంలో వైకింగ్ యోధులు వినియోగించిన ఆయుధాలు, వస్తువులు, గొడ్డళ్లు, కత్తులు అస్థిపంజరాలతో పాటు లభ్యమయ్యాయి. చనిపోయిన యోధుల గౌరవార్థం వారి శరీరాలను పూడ్చిపెట్టే ముందు నలుగురు వ్యక్తులు ఆత్మార్పణ కూడా చేసుకున్నారని ఆర్కియాలజిస్టులు తెలిపారు. యుద్ధంలో మరణించిన 300 మందిలో ఐదో వంతు మంది స్త్రీలు ఉన్నట్లు పేర్కొన్నారు. డెర్బీషైర్‌లోని రెప్టాన్ ప్రాంతంలో ఆంగ్లో సాక్సన్ రాజ్యం మెర్సియాపై వైకింగ్స్ దండెత్తారు. ఇరు రాజ్యాల మధ్య జరిగిన కొన్నిరోజుల పాటు సాగిన హోరాహోరీ యుద్ధంలో ఆంగ్లో సాక్సన్లను మెర్సియా నుంచి వైకింగ్స్ తరిమికొట్టారు. మెర్సియాపై విజయంతో వైకింగ్ గ్రేట్ ఆర్మీకి గ్రేట్ హీతెన్ ఆర్మీ అనే పేరును తెచ్చిపెట్టింది. వైకింగ్స్ ధాటికి మెర్సియా రాజు పారిస్‌కు పారిపోయారు. ఎవరీ వైకింగ్స్? డెన్మార్క్, నార్వే, స్వీడన్లకు చెందిన నార్స్ యుద్ధ వీరులతో ఏర్పాటైన కూటమే ‘ది వైకింగ్ గ్రేట్ ఆర్మీ’. 816లో డెనిష్, స్వీడీష్ వైకింగ్ నాయకుడు రాగ్నర్ లోత్‌బ్రోక్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మూడు రాజ్యాల వీరులు కలసి ‘ది వైకింగ్ గ్రేట్ ఆర్మీ’గా ఏర్పాడ్డారు. ఇంగ్లండ్‌గా అవతరించిన నాలుగు ఆంగ్లో సాక్సన్ రాజ్యాలపై యుద్ధాలు చేసిన వైకింగ్ యోధుల చరిత్రను వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నార్త్ అంబ్రియన్ దళాలతో తొలుత యుద్ధానికి దిగిన వైకింగ్స్ వరుసగా 14 ఏళ్ల పాటు యుద్ధాలు చేశారు. ఈ కాలంలోనే ఆంగ్లో సాక్సన్ రాజ్యాల్లో కీలకమైనదైన మెర్సియా రాజ్యాన్ని జయించారు. ఆ తర్వాతి కాలంలో మెర్సియా వైకింగ్స్ ఎంతగానో ఉపయోగపడింది.