ఆర్‌బీఐ పాలసీ : వడ్డీరేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HDFC Raises Interest Rate On Home Loans - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లను పెంచింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది.  ‘10 బేసిస్‌ పాయింట్ల మేర రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును పెంచుతున్నాం. నేటి నుంచే ఈ పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు తెలిపింది. దీంతో ఈఎంఐ మరింత భారంగా మారనుంది. ఆగస్టులో కూడా 20 బేసిస్‌ పాయింట్ల గృహ రుణాల వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లను పెంచడంతో, హెచ్‌డీఎఫ్‌సీ కూడా వడ్డీరేట్లను పెంచింది. తాజాగా మరోసారి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైపాక్షిక మానిటరీ పాలసీ సమీక్ష మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, హెచ్‌డీఎఫ్‌సీ ఈ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది.

ఈ సారి పాలసీలో కూడా రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ధరలు పెరగడంతో, రూపాయి విలువ క్షీణించడంతో, ద్రవ్యోల్బణం మరింత పెరిగే భయాందోళనలు ఉండటంతో, కీలక రెపోను మరోసారి పెంపుకే ఆర్‌బీఐ మొగ్గుచూపుతుందని మెజార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. గత నెలలో దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్బీఐ కూడా మూడేళ్ల వరకు ఉన్న అన్ని కాల వ్యవధిలపై వడ్డీరేట్లను 20 బేసిస్‌ పాయింట్లను పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top