హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,107 కోట్లు | HDFC Q2 net profit up 2% at Rs 2106 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,107 కోట్లు

Oct 27 2015 12:57 AM | Updated on Sep 3 2017 11:31 AM

హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,107 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,107 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 2 శాతం పెరిగింది.

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 2 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ2లో రూ.2,064 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,107 కోట్లకు ఎగసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,608 కోట్ల నుంచి రూ.12,521 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ చెప్పారు. జీవిత బీమా వ్యాపారం జోరు కారణంగా నికర లాభంలో వృద్ధి సాధించామని వివరించారు.

స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.1,358 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,605 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  మొత్తం ఆదాయం రూ.6,671 కోట్ల నుంచి రూ.7,480 కోట్లకు ఎగసిందని తెలిపారు.
 
వచ్చే ఏడాది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఐపీఓ
గత క్యూ2లో  రూ.184 కోట్లుగా ఉన్న జీవీత బీమా వ్యాపార విభాగం నికర లాభం రూ.215 కోట్లకు వృద్ధి చెందిందని మిస్త్రీ వివరించారు.  సాధారణ బీమా వ్యాపార నికర లాభం రూ.36 కోట్ల నుంచి రూ.61 కోట్లకు పెరిగిందని,  రూ.719 కోట్లు పన్నుల కోసం కేటాయించామని చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 4% నుంచి 3.95 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం (డివిడెండ్‌తో కలుపుకొని) రూ.2,059 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.2,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డివిడెండ్ కారణంగా నికర వడ్డీ ఆదాయం పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 0.71%గా ఉన్నాయని, వ్యక్తుల మొండి బకాయిలు 0.53 %గా, సంస్థల మొండి బకాయిలు 1.12 %గా ఉన్నాయని తెలిపారు. లోన్‌బుక్ రూ.2,12,344కోట్ల నుంచి రూ.2,37,991 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏడాది కాలంలో రూ.12,969 కోట్ల రుణాలు విక్రయించామని తెలిపారు. విదేశాల్లో రూపీ బాండ్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి వాటాదారుల ఆమోదం పొందామని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఐపీఓ వచ్చే ఏడాది మధ్యన ఉండొచ్చని తెలిపారు.
 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 2 శాతం నష్టంతో రూ.1,313 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement